![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ శ్రీసత్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిస్ బాస్ 6లోకి 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో అందమైన కంటెస్టెంట్ కూడా శ్రీసత్యనే . విజయవాడకు చెందిన శ్రీసత్య.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విజేతగా నిలిచింది. నేను శైలజ, ‘లవ్ స్కెచ్’, గోదారి నవ్వింది వంటి సినిమాల్లో శ్రీసత్య నటించింది. ‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాంటి శ్రీ సత్య ఇప్పుడు "మాట్లాడుకుందామా" అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ తో కాసేపు మాట్లాడింది. "ఎంత క్యూట్ గా ఉన్నావ్ .. సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తారు ఎందుకు" అని ఒక నెటిజన్ అడిగేసరికి " ఎం చేస్తామండీ. తెలుగమ్మాయిలు లేరు అంటారు.. మేము తెలుగమ్మాయిలమే...మరి ఎందుకు తీసుకోరో మాకు ఒక్కోసారి అర్ధం కాదు.. నాకు కూడా ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్..ఒక పది మంది తెలుగమ్మాయిలు ఉంటె అందులో ఒకరో ఇద్దరినో మాత్రమే తీసుకుంటున్నారు అతి కష్టం మీద..
మరి ఎం జరుగుతుందో తీసిన వాళ్ళను అడగాలి.. తెలుగమ్మాయిలు బాగుండేవాళ్లు కూడా వాళ్లకు నచ్చరేమో" అని ఆన్సర్ ఇచ్చింది. బిగ్ బాస్ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు "యావర్, శివాజీ, ప్రశాంత్ ఇష్టం.. ఇప్పటివరకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఏమీ చూడలేదు..ఇప్పుడే అన్ని ఎపిసోడ్స్ చూసాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను.. 365 డేస్ చికెన్ పెట్టినా తింటా..కొన్ని పండగల సమయాల్లో తప్ప.. నా చేతికి పెట్టుకున్న ఉంగరాలు జాతకం ఉంగరాలు..నాకు కొంచెం జాతకం పిచ్చి ఉంది.. ఎవరి ఫ్యాన్ పేజెస్ వాళ్ళు వాళ్లకు నచ్చిన వాళ్ళను సపోర్ట్ చేసుకుంటారు. నేను చేయొద్దని ఎవరికీ చెప్పను ..ఎవరిష్టం వాళ్ళది" అంటూ నెటిజన్స్ అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చింది శ్రీసత్య.
![]() |
![]() |